Sunday, February 23, 2025
Homeస్పోర్ట్స్గుజరాత్ చేతిలో లక్నో చిత్తు

గుజరాత్ చేతిలో లక్నో చిత్తు

Lucknow lost: ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ లో అంతగా రాణించలేక 144 పరుగులే చేసిన గుజరాత్… బౌలింగ్ లో ప్రతాపం చూపి లక్నోను 82 పరుగులకే ఆలౌట్ చేసి ఘన విజయం సొంతం చేసుకుంది. బౌలర్లు సమిష్టిగా రాణించి సత్తా చాటారు.

పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది, జట్టు స్కోరు 8 వద్ద ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(5) ఔటయ్యాడు, 24 వద్ద మాథ్యూ వాడే(10), 51 వద్ద  కెప్టెన్ హార్దిక్ పాండ్యా(11) లు కూడా ఔటై పెవిలియన్ చేరారు. ఈ దశలో శుభమన్ గిల్ – డేవిడ్ మిల్లర్ లు నాలుగో వికెట్ కు 52 పరుగులు జోడించారు. వాడే 26 పరుగులు చేసి వెనుదిరిగాడు. గిల్ 49 బంతుల్లో 7ఫోర్లతో 63; రాహుల్ తెవాటియా 22 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో ఆవేష్ ఖాన్ రెండు; మోసిన్ ఖాన్, జేసన్ హోల్డర్ చెరో వికెట్ పడగొట్టారు.

లక్ష్యం స్వల్పమే అయినా లక్నో వెంట వెంట వికెట్లు కోల్పోయింది, 45 పరుగులకే నలుగురు కీలక బ్యాట్స్ మెన్ (డికాక్-11; కెప్టెన్ కెఎల్ రాహుల్-8; కరణ్ శర్మ-4; కృనాల్ పాండ్యా-5) ఔటయ్యారు. ఆయూష్ బదోనీ కూడా 8 పరుగులే చేసి వెనుదిరిగాడు. దీపక్ హుడా ఒక్కడే 27 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచాడు. జట్టు మొత్తంలో కేవలం ముగ్గురే రెండంకెల స్కోరు చేయగలిగారు.13.5  ఓవర్లలో 82 పరుగులకే లక్నో ఆలౌట్ అయ్యింది.

గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4; యష్ దయాళ్, రవి శ్రీనివాసన్ సాయి కిశోర్ చెరో 2; షమీ ఒక వికెట్ పడగొట్టారు.

శుభమన్ గిల్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : ఆ వార్తల్లో నిజం లేదు: ద్రావిడ్  

RELATED ARTICLES

Most Popular

న్యూస్