Take it as Challenge: రోడ్ల మరమ్మతుల విషయంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఛాలెంజ్ గా తీసుకొని పనితీరుతోనే సమాధానం చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రోడ్లన్నింటినీ బాగు చేయడానికి ప్రభుత్వం చాలా ప్రణాళికబద్ధంగా పనిచేస్తోందని, ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధిచేసుకుంటూ ముందుకుసాగుతోందని చెప్పారు. ఈ దీనికోసం ప్రభుత్వం, అధికారులు చాలా కష్టపడుతున్నారని కితాబిచారు. అయినా సరే పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా విమర్శలు, వక్రీకరణలు చేస్తున్నారని సిఎం అభిప్రాపయడ్డారు. ఆర్ అండ్ బీ రోడ్లను బాగుచేయడం కోసం దాదాపుగా రూ.2500 కోట్లు ఖర్చు పెడుతున్నామని, ఏడాదిలోగా రోడ్ల విషయంలో గణనీయ ప్రగతి కనిపించాలని సూచించారు. రాష్ట్రంలో రోడ్లు, సంబంధిత అభివృద్ధి పనులపై తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహంచారు.
ఈ సందర్భంగా సిఎం చేసిన సూచనలు:
⦿ పీఆర్ రోడ్ల కోసం సుమారు రూ.1072.92 కోట్లు ఖర్చుచేస్తున్నాం
⦿ రోడ్ల విషయంలో వాస్తవాలు వక్రీకరించడానికి ప్రతిపక్షాలు, వాటికి సంబంధించిన మీడియా నానా ప్రయత్నాలు చేస్తున్నాయి
⦿ ప్రతి జిల్లాలో గతంలో ఎంత ఖర్చుచేశారు? ఇప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నాం ? అన్నదానిపై వివరాలను ప్రజలముందు ఉంచండి
⦿ ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్లు ఇలా అన్ని విషయాల్లో గతంలో ఎంత? ఇప్పుడు ఎంత ఖర్చు చేశామో వెల్లడించండి
⦿ గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి? బాగుచేసిన తర్వాత ఎలా ఉన్నాయి.. నాడు – నేడు పేరుతో ఫొటోగ్యాలరీ ఏర్పాటు చేయాలి
⦿ బ్రిడ్జిలు పూర్తై అప్రోచ్ రోడ్లు లేనివి, పెండింగ్ బ్రిడ్జిలు, ఆర్వోబీలు.. ఇవన్నీ కూడా పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
⦿ యుద్ధ ప్రాతిపదికిన దీనిమీద దృష్టిపెట్టాలి, వచ్చే ఏడాదిలోగా ఇవి పూర్తికావాలి
⦿ రోడ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యమైనది, ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత పాటించాలి
⦿ నిర్దేశించిన ప్రమాణాలు ప్రకారం రోడ్లు వేయాలి
⦿ ఉమ్మడి వైయస్సార్ జిల్లా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న బ్రిడ్జిలు, కల్వర్టులు శాశ్వత పరిష్కారంపై దృష్టిపెట్టాలి
అని సిఎం అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), సీఎస్ సమీర్‌శర్మ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : రోడ్లపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం: మంత్రి