Saturday, November 23, 2024
HomeTrending Newsఆయిల్ ఫామ్ ధరలపై త్వరలో నిర్ణయం: కాకాణి

ఆయిల్ ఫామ్ ధరలపై త్వరలో నిర్ణయం: కాకాణి

Oilpalm:  రాష్ట్రంలో రైతులు,ఫ్యాక్టరీల యాజమాన్యాలకు ఆమోద యోగ్యంగా ఉండే రీతిలో ఆయిల్ ఫామ్ ధరలను త్వరలో నిర్ణయిస్తామని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్,ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి స్పష్టం చేశారు. అమరావతి సచివాలయం రెండవ బ్లాకు సమావేశ మందిరంలో ఆయిల్ ఫామ్ ధరల నిర్ధారణ అంశంపై రైతులు, సంబంధిత కంపెనీల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇటు రైతులు,  అటు ఫ్యాక్టరీల యాజమాన్యాలు నష్టపోకుండా అందరికీ ఆమోద కరమైన రీతిలో సీజన్ ప్రారంభానికి ముందే ఆయిల్ ఫామ్ ధరలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఓఇఆర్(ఆయిల్ ఎక్ట్రాక్సన్ రేషియో)ను శాస్త్రీయ విధానంలో అడాప్ట్ చేయడం ద్వారా ఆయిల్ ఫామ్ ధరల నిర్ణయానికి చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి గోవర్ధనరెడ్డి చెప్పారు.రాష్ట్రానికి ఫ్యాక్టరీలు రావాలి, ఉపాధి అవకాశాలు పెరగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.

గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా వదిలి వేసిందని ఆ బకాయిలన్నీఈ ప్రభుత్వం చెల్లించడంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందని మంత్రి పేర్కొన్నారు. డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించి పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

ఈసమావేశంలో రాష్ట్ర ఉద్యానవన శాఖ కమీషనర్ డా.ఎస్.ఎస్.శ్రీధర్,ఎపి ఆయిల్ ఫెడ్ ఎండి సి.బాబూరావు,అదనపు సంచాలకులు కె.బాలజీ నాయక్,యం.వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయిల్ ఫామ్ సాగుదారుల సంఘం అధ్యక్షులు బి.వీర రాఘవరావు, జనరల్ సెక్రటరీ రంగారావు, రైతు క్రాంతి కుమార్, గోద్రెజ్ కంపెనీ ప్రతినిధి కెవిఎస్ ప్రసాద్,మరో కంపెనీ ప్రతినిధి ఆసిస్ గోయెంకా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్