Thursday, March 12, 2026
HomeTrending Newsబండి సంజయ్ పై కేటిఆర్ పరువు నష్టం దావా

బండి సంజయ్ పై కేటిఆర్ పరువు నష్టం దావా

బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్. ఈ మేరకు తన న్యాయవాది చేత బండి సంజయ్ కి నోటీసులు జారీచేసిన కేటీఆర్. ఈనెల 11వ తేదీన ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ పైన నిరాధారమైన ఆరోపణలు చేసిన బండి సంజయ్ ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ కోరాలని డిమాండ్ చేసిన కేటీఆర్.  లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించిన మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఈ రోజు నోటీసులు జారీ చేసిన కేటీఆర్ న్యాయవాది.

మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధార పూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో పేర్కొన్న న్యాయవాది. ఒక జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలో కనీస ప్రమాణాలు పాటించకుండా… కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారన్న న్యాయవాది. మంత్రి కేటీఆర్  పరువుకు కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని తన నోటీసులో పేర్కొన్న న్యాయవాది. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న న్యాయవాది.

Also Read : తెలంగాణ.. పట్టణ రాష్ట్రం మంత్రి కేటిఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular