Sunday, March 15, 2026
HomeTrending Newsహైదరాబాద్ లో బుద్ద పూర్ణిమ వేడుకలు

హైదరాబాద్ లో బుద్ద పూర్ణిమ వేడుకలు

గౌతమ బుద్ధుడి 2566 వ జయంతి వేడుకలు ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బౌద్ధ బిక్షువులు నిర్వహించిన కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం బుద్ధుడి విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ప్రారంభించారు. హైదరాబాద్  హుస్సేన్ సాగర్ జలాశయంలోని బుద్ధవిగ్రహం వద్ద కనుల పండువగా జరిగిన బుద్ద పూర్ణిమ వేడుకల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బౌద్ద భిక్షవులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పరిగి శాసన సభ్యులు శ్రీ మహేష్ రెడ్డి, టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, టూరిజం MD మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పలువురు బౌద్ద బిక్షువులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular