Collections Hit: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సంచలనం సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ రిలీజైన అన్ని ఏరియాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మహేష్ బాబు స్టామినా ఏంటి అనేది ఈ సినిమా మరోసారి నిరూపించిందని చెప్పచ్చు.
ఇక నాలుగు రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాం – 29.61 కోట్లు, సీడెడ్ – 9.81 కోట్లు, ఉత్తరాంధ్ర – 9.36 కోట్లు, గుంటూరు – 7.57 కోట్లు, ఈస్ట్ – 6.51 కోట్లు, కృష్ణా – 5.4 కోట్లు, వెస్ట్ – 4.41 కోట్లు, నెల్లూరు – 2.91 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి – 75.58 కోట్లు, కేఎ+ఆర్ఓఐ – 7.6 కోట్లు, ఓవర్ సీస్ – 11.9 కోట్లు టోటల్ గా వరల్డ్ వైడ్ షేర్ – 95.08 కోట్లు. ప్రాంతీయ చిత్రాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా నిలిచింది.
Also Read : సర్కారు వారి రెండో రోజు కలెక్షన్స్ ఎంత.?