Sunday, September 29, 2024
Homeసినిమా‘ఐ యామ్  ఏ సెలబ్రిటీ’ అంటున్న రఘు కుంచే

‘ఐ యామ్  ఏ సెలబ్రిటీ’ అంటున్న రఘు కుంచే

Celebrity: గాయకుడిగా తన సినీ ప్రస్థానం ప్రారంభించిన రఘు కుంచే సంగీత దర్శకుడిగా , నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఒక వైపు సంగీత దర్శకుడిగా మరో వైపు నటుడిగా ఎన్నో సినిమాలు చేస్తూ , తాను చవిచూసిన అనుభవాలను “ఐ యామ్  ఏ సెలబ్రిటీ” ( I’m A Celebrity) పేరుతో, తనే  లిరిక్స్ ని అందించి , మ్యూజిక్ కంపోజ్ చేసి , తనే పాడిన , ఒక వినోదాత్మకమైన పాటను మన తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు ఆ పాట యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.

ఈ సందర్భంగా రఘు కుంచే మాట్లాడుతూ “ప్రతి మనిషికి సమాజంలో మంచి  గుర్తింపు కావాలని ఉంటుంది కానీ, ఆ గుర్తింపు కొందరికే వస్తుంది.  కృషి పట్టుదలతో కొందరు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అందర్నీ మెప్పిస్తారు. అందుకే సమాజంలో వాళ్ళని ప్రత్యేకంగా గౌరవిస్తారు. ఒక సెలబ్రిటీ హోదా ఇస్తారు. సినిమా రంగం అయినా,  పొలిటికల్ రంగం విద్యారంగం అయినా, ప్రజలని  మెప్పించ గలిగితే  చాలు వాళ్ళకి సెలబ్రిటీ హోదా ఇచ్చేస్తారు. కానీ ఈ సెలబ్రిటీ హోదాని  బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. విశృంఖలంగా పెరిగిపోయిన సోషల్ మీడియా ప్రభావం వల్ల, ఒక సెలబ్రిటీ స్థాయిలో ఏమి చేసిన  అది మంచి అయినా చెడు అయినా ఒక పెద్ద వైరల్ గా మారుతుంది”

“నిజం చెప్పాలంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ జీవితం కత్తి మీద సాము లాగా అయిపోయింది. వాళ్ళు ఏమి  చేసినా సోషల్ మీడియా లో అదొక పెద్ద వార్త అవుతుంది , మీమ్ అవుతుంది ,యూట్యూబ్ లో థంబ్ నైల్ అవుతుంది. వీటన్నిటి ఆధారంగానే  దీన్ని  ఒక వినోదభరితమైన పాటగా మలిచాను. ఐ యామ్ ఏ సెలబ్రిటీ (I’m A Celebrity) పాట మీకు మంచి వినోదాన్ని అందిస్తుందని  ఆశిస్తున్నాను. మరియు , ఈ పాట కేవలం  వినోదం కోసం చేసిన పాట మాత్రమే తప్ప ఎవరినో కించపరచడానికో, లేక తక్కువ చేయడానికో  చేసింది కాదు . ఎవరి మనసులనైనా కష్టపెడితే, క్షమించమని ముందుగానే కోరుకుంటున్నాను” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్