దేశంలో మరో రెండు కొత్త వేరియంట్లను గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) స్పష్టం చేసింది. ఒమిక్రాన్ ఉపవేరియంట్లు బీఏ.4, బీఏ.5లను కేసులు వెలుగు చూశాయని తెలిపింది. తమిళనాడు, తెలంగాణలో ఈ కేసులు బయటపడినట్లు వెల్లడించింది. తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల యువతిలో ఒమిక్రాన్ బీఏ.4ను గుర్తించామని ఇన్సాకాగ్ పేర్కొంది. తెలంగాణలో 80 ఏళ్ల వృద్ధుడిలో బీఏ.5 బయటపడినట్లు స్పష్టం చేసింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరువురు బాధితుల కాంట్రాక్ట్ ట్రేసింగ్‌ను చేపట్టినట్లు కేంద్ర ఆరోగ్య సంస్థ తెలిపింది.
Also Read : ఉత్తరకొరియాను చుట్టుముట్టిన కరోనా