Saturday, November 23, 2024
HomeTrending Newsప్ర‌తీ జిల్లాలో రేడియోల‌జీ ల్యాబ్ : హ‌రీశ్‌రావు

ప్ర‌తీ జిల్లాలో రేడియోల‌జీ ల్యాబ్ : హ‌రీశ్‌రావు

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 రేడియోలజీ ల్యాబ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నామ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో అన్నీ రకాల వైద్య పరీక్షలు పేదలకు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆస్ప‌త్రిలో రేడియోల‌జీ హ‌బ్‌ను మంత్రి హ‌రీశ్‌రావు ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ చైర్మ‌న్ రోజాశ‌ర్మ‌, వైస్ చైర్మ‌న్ క‌న‌క‌రాజు, మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ రాజ‌నర్సు, మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ పాల సాయిరాం, సుడా డైరెక్ట‌ర్ మ‌చ్చ వేణుగోపాల్, డీఎంహెచ్‌వో కాశీనాథ్‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచ‌న మేర‌కు ప్ర‌తి జిల్లా ఆస్ప‌త్రిలో టీ డ‌యాగ్నోస్టిక్ హ‌బ్‌, రేడియోల‌జీ హ‌బ్ ప్రారంభిస్తున్నామ‌ని చెప్పారు. ప్రతి పీహెచ్‌సీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వచ్చే వారికి 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తాం. ఈసీజీ, 2డీ ఈకో, ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, మెమెగ్రఫీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు. గ‌తంలో వివిధ ప‌రీక్ష‌ల కోసం ప్ర‌భుత్వ వైద్యులు.. ప్ర‌యివేటు ల్యాబ్‌ల‌కు పంపేవారు.. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత అలాంటి ప‌రిస్థితి లేద‌న్నారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఏర్పాటు చేస్తున్న టీ డ‌యాగ్నోస్టిక్ హ‌బ్, రేడియోల‌జీ ల్యాబ్‌ల‌ను ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని మంత్రి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్