CM at Davos: ప్రపంచ ఆర్ధిక సమాఖ్య సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం మూడోరోజు ఆహార ఉత్పత్తుల ప్రాససింగ్, గ్రీన్ ఎనర్జీ, హై ఎండ్ టెక్నాలజీపై దృష్టి పెట్టింది. ఆయా రంగాల్లోని ప్రముఖులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహించారు. ఏపీలో కర్బన రహిత విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్‌కో – ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం.8వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై అవగాహనా ఒప్పందం. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, గ్రీన్‌కో తరఫున అనిల్ చలమలశెట్టి సంతకాలు చేశారు.
సిఎం సమావేశాల వివరాలు:
డబ్ల్యూఈఎఫ్ వేదిక కాంగ్రెస్ సెంటర్‌లో బహ్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్ అల్ ఖలీఫాతో సీఎం వైయస్.జగన్ భేటీ. బహ్రెయిన్‌కు రాష్ట్రం నుంచి విరివిగా ఎగుమతులపై చర్చ. విద్యారంగంలో పెట్టబుడులపైనా చర్చ.
దావోస్: సెకోయ క్యాపిటల్ ఎండీ రంజన్ ఆనందన్‌తో కాంగ్రెస్ సెంటర్లో సమావేశమైన సీఎం.
స్టార్టప్ ఎకో సిస్టం అభివృద్ధిపై చర్చ. ఏపీలో కార్యకలాపాల ప్రారంభం అంశంపైనా చర్చ.
ష్నైడర్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెశిడెంట్ లుక్ రెమంట్‌తో సీఎం భేటీ. దేశీయ, అంతర్జాతీయ అవసరాలను తీర్చేవిధంగా ఉత్పత్తి కేంద్రంగా ఏపీని చేసుకోవడంపై చర్చ. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్రంలోకి భారీగా వస్తుండడంతో ఆ అవకాశాలను వినియోగించుకోవాలని వివరించిన సీఎం.
ఏపీ పెవిలియన్‌లో జుబిలియంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కాళీదాస్ హరి భర్తియాతో సీఎం భేటీ
వ్యవసాయం, ఆహారం, ఫార్యారంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న జుబిలియంట్ గ్రూపు.
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు, వాటి ప్రాససింగ్‌పై విస్తృత చర్చ.
ఏపీ పెవిలియన్‌లో ప్రఖ్యాత స్టీల్ కంపెనీ ఆర్సెల్‌విట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్‌తో సీఎం జగన్ భేటీ.
గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై చర్చ. గ్రీన్‌కో భాగస్వామ్యంతో ఏపీలోకి అడుగుపెడుతున్నామని ప్రకటించిన ఆదిత్య మిట్టల్. ప్రపంచంలోనే తొలి హైడ్రో పంప్డ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతున్నామని వెల్లడి.
తమ కంపెనీ తరఫున 600 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్టు వెల్లడి. సీఎంతో చర్చ తర్వతా ఈ విషయాలను డీ కార్బనైజ్ ఎకానమీపై జరిగిన సదస్సులో వెల్లడించిన ఆదిత్య మిట్టల్.
పనోరమాలో తర్వాత ట్రాన్సిషిన్ టు డీకార్బనైజ్డ్ ఎకానమీపై జరిగిన సెషన్‌లో ప్రారంభ ఉపన్యాసనం చేసిన సీఎం.
ఐబీఎం ఛైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతో సీఎం వైయస్.జగన్ భేటీ. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధిపై చర్చ. విశాఖను హై ఎండ్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపిన సీఎం.