Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: ఫైనల్స్ కు రాజస్థాన్

ఐపీఎల్: ఫైనల్స్ కు రాజస్థాన్

Rajasthan into Finals:  రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ ఫైనల్స్ కు చేరుకుంది, నేడు జరిగిన క్వాలిఫైర్-2 మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పై వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ మరోసారి సెంచరీ తో తన ప్రతాపం చూపి బెంగుళూరు బౌలింగ్ ను చీల్చి చెండాడాడు, 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ మొదటి ఓవర్ నుంచే ఎదురుదాడి మొదలు పెట్టింది. ఓపెనర్లు బట్లర్-యశస్వి జైస్వాల్ తొలి వికెట్ కు 5.1 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. జైశ్వాల్ 21 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో వికెట్ కు బట్లర్- సంజూ శామ్సన్ 52 పరుగులు చేశారు. సంజూ-23; దేవదత్ పడిక్కల్-9 పరుగులు చేసి ఔట్ కాగా, బట్లర్, హెట్మెయిర్ తో కలిసి18.1 ఓవర్లలోనే జట్టును గెలిపించాడు. బెంగుళూరు బౌలర్లలో హాజెల్ వుడ్ రెండు; హసరంగ ఒక వికెట్ పడగొట్టారు.

అంతకుముందు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  బెంగుళూరు 9 పరుగులకే తొలి వికెట్ (కోహ్లీ-7) కోల్పోయింది. కెప్టెన్ డూప్లెసిస్-రజత్ పటీదార్ రెండో వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డూప్లెసిస్-25;  గ్లెన్ మాక్స్ వెల్-24 పరుగులు చేసి ఔటయ్యారు. పటీదార్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. మహీపాల్ లామ్రోర్-8; దినేష్ కార్తీక్-6 ; షాబాజ్ అహ్మద్-12లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు  చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, ఒబెద్ మెక్ రాయ్ చెరో మూడు; రవిచంద్రన్ అశ్విన్, బౌల్ట్ చెరో వికెట్ పడగొట్టారు.

జోస్ బట్లర్ కే ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

ఆదివారం నాడు గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇదే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Also Read : లక్నో నిష్క్రమణ: క్వాలిఫైర్ 2 కు బెంగుళూరు

RELATED ARTICLES

Most Popular

న్యూస్