Saturday, November 23, 2024
Homeసినిమా'ఎఫ్ 3'తో సునీల్ కి కలిసొచ్చిందెంత?

‘ఎఫ్ 3’తో సునీల్ కి కలిసొచ్చిందెంత?

Sunil reback? సునీల్ స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగాడు. బ్రహ్మానందం .. ఎమ్మెస్ .. ధర్మవరపు వంటి మహామహులు బరిలో ఉన్నప్పుడే సునీల్ దూసుకుపోయాడు. తనదైన ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో సునీల్ ఆకట్టుకున్నాడు. అయితే ఆ తరువాత ఆయన హీరో వేషాల వైపు వెళ్లాడు. అదంత సేఫ్ జోన్ కాదని తెలిసి ఆయన వెనక్కి వచ్చ్చాడుగానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఒక వైపున విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూనే, మళ్లీ కమెడియన్ గా కుదురుకోవడానికి ఆయన తనవంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. సరైన పాత్ర కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తూనే ఉన్నాడు.

కమెడియన్ గా ఆయన గ్రాఫ్ ను రివ్వున పేయికి లేపేసే అలాంటి పాత్ర సునీల్ కి పడిందని ‘ఎఫ్ 3’ వేదికపై వరుణ్ తేజ్ చెప్పాడు. తనకి సునీల్ కామేడీ అంటే చాలా ఇష్టమనీ, చాలా కాలం తరువాత ఈ సినిమాలో పాత సునీల్ ను చూస్తారని అన్నాడు. దాంతో ఈ సినిమాలో సునీల్ కామెడీని కుమ్మేసి ఉంటాడని అంతా అనుకున్నారు. ఈ సినిమాతో కమెడియన్ గా పూర్వ వైభవాన్ని అందుకుంటాడని భావించారు. అసలే అనిల్ రావిపూడి సినిమా .. ఆపై తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టేసే వెంకీ కాంబినేషన్లో కామెడీ అంటే మినిమమ్ ఉంటుందని అందరూ భావించారు. అలా అనుకుని వెళ్లిన ప్రేక్షకులు ‘అంత లేదమ్మా’  అనుకుంటున్నారు.

ఈ సినిమాలో సునీల్ పాత్రను ఆయన స్థాయిలో డిజైన్ చేయలేకపోయారు. డిజైన్  చేసిన దాంట్లో అనిల్ రావిపూడి మార్క్ కనిపించదు. వరుణ్ తేజ్ ను అల్లుడు అని పిలుస్తూ .. ఆయనతో మామా అని పిలిపించుకుంటూ ఉంటాడు. కనిపించడానికి వరుణ్ తో కలిసి సినిమా అంతా కనిపిస్తూనే ఉంటాడు .. కానీ ఆయన వైపు నుంచి కావలసినంత కామెడీనే వర్కౌట్ కాలేదు. కమెడియన్ గా మళ్లీ ఆయన సత్తాను చాటే స్థాయి పాత్ర ఇది కాదనే చెప్పాలి. ఒక్క సునీల్ విషయంలోనే కాదు .. ఆల్రెడీ ‘ఎఫ్ 2’లో సందడి చేసిన రఘుబాబు .. అన్నపూర్ణమ్మ .. వై. విజయ పాత్రలు కూడా ఆ స్థాయిలో పేలలేదు అనడంలో సందేహం లేదు.

Also Read : మళ్లీ సునీల్ నవ్వుల్లో ముంచేస్తాడు: అనిల్ రావిపూడి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్