Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్-2022 విజేత గుజరాత్

ఐపీఎల్-2022 విజేత గుజరాత్

Gujarath are titans:  టాటా ఐపీఎల్ ­-2022ను గుజరాత్ టైటాన్స్ గెల్చుకుంది. నేడు జరిగిన ఫైనల్స్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించింది. బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో రాజస్థాన్ కేవలం 131  పరుగుల లక్ష్యాన్ని మాత్రమే గుజరాత్ కు నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. శుభమన్ గిల్ సిక్సర్ తో విన్నింగ్ షాట్ కొట్టి  మ్యాచ్ ముగించాడు.

గుజరాత్, అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 31 పరుగుల వద్ద తొలి వికెట్ (యశస్వి జైస్వాల్-22) కోల్పోయింది. జోస్ బట్లర్ తన సహజ శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. బట్లర్ ఒక్కడే 39 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.  విఫలమయ్యాడు. కీలక మ్యాచ్ లో కెప్టెన్ సంజూ శామ్సన్(14); హెట్మెయిర్ (11); దేవదత్ పడిక్కల్ (2) విఫలమయ్యారు. చివర్లో రియాన్ పరాగ్­­-15; ట్రెంట్ బౌల్ట్-11 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది.

గుజరాత్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు, శ్రీనివాసన్ సాయి కిశోర్ రెండు; షమి, యష్ దయాళ్, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(5); మాథ్యూ వాడే(8) విఫలమయ్యారు. ఓపెనర్ శుభమన్ గిల్ – కెప్టెన్ హార్దిక్ పాండ్యా కలిసి మూడో వికెట్ కు 63  పరుగులు జోడించారు. 30  బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో 34 పరుగులు చేసి పాండ్యా ఔటయ్యాడు. గిల్- డేవిడ్ మిల్లర్ లు కలిసి మరో వికెట్ పడకుండా విజయం అందించారు.  గిల్ 43 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సర్ తో 45; మిల్లర్ 19 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సర్ తో 32 పరుగులతో అజేయంగా నిలిచారు.

రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ కృష్ణ, యజువేంద్ర చాహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

హార్దిక్ పాండ్యాకు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్