Saturday, November 23, 2024
HomeTrending Newsనేపాల్ విమాన ప్రమాదంలో 14 మృతదేహాలు లభ్యం

నేపాల్ విమాన ప్రమాదంలో 14 మృతదేహాలు లభ్యం

నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లాలోని పర్వత ప్రాంతాల్లో ఆదివారం కూలిపోయిన విమాన ప్రమాదంలో ప్రయాణికులంతా మరణించారు. నలుగురు భారతీయులు సహా 22 మందితో కూలిపోయిన తారా ఎయిర్‌లైన్స్ విమానం శిథిలాల నుంచి 14 మృతదేహాలను భద్రతా దళాలు సోమవారం బయటకు తీశాయి. మిగిలిన వారి అవశేషాల కోసం ఆ ప్రాంతాన్ని గాలిస్తున్నారు.

పోఖ్రా నుంచి టేకాఫ్ అయిన 15 నిమిషాల తర్వాత కంట్రోల్ టవర్‌తో సంబంధాలు కోల్పోయింది. వెంటనే రంగంలోకి దిగిన నేపాల్‌ ఆర్మీ, ఏవియేషన్‌ అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. మంచు తీవ్రత అధికంగా ఉండటంతో ఆదివారం పూర్తిస్థాయిలో రెస్క్యూ చర్యలకు ఆటంకం ఏర్పడింది. రెస్క్యూ దళాలు విమానం కూలిపోయిన స్థలాన్ని భౌతికంగా గుర్తించాయి. ప్రతికూల వాతావరణం ఉండటంతో సన్సోవార్‌లో ఉన్న కొండల అంచులను ఢీకొట్టిన విమానం 14,500 అడుగుల లోతులో పడిపోయిందని… దీంతో విమానం ఆచూకీని గుర్తించడానికి ఆలస్యమయిందని అధికారులు తెలిపారు. వివిధ ఏజెన్సీలకు చెందిన ఇతర రెస్క్యూ టీమ్ సభ్యులు చిన్న హెలికాప్టర్‌లను ఉపయోగించి ఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

కాగా, ఈ విమానంలో ఉన్న నలుగురు భారతీయులు ఒకే కుటుంబానికి చెందినవారే. మహారాష్ట్రకు చెందిన వైభవి త్రిపాఠితోపాటు ఆమె భర్త అశోక్, పిల్లలు ధనుష్, రితికాలుగా వారిని గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి వైభవి త్రిపాఠి అక్కను ముంబై పోలీసులు సంప్రదించారు. అయితే, ఈ ప్రమాదం గురించి తన తల్లికి చెప్పవద్దని, ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని అభ్యర్థించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్