Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్నార్వే చెస్: ఐదో స్థానంలో ఆనంద్

నార్వే చెస్: ఐదో స్థానంలో ఆనంద్

Ends with 5th: నార్వే చెస్‌ బ్లిట్జ్ ఈవెంట్‌లో  భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్  తన ఏడవ రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించాడు.  మొత్తం పదిమంది ఆటగాళ్ళు పాల్గొన్న ఈ ఈవెంట్ లో  ఆనంద్ ఐదు పాయింట్లు సంపాదించి నాలుగో స్థానంలో నిలిచాడు.

ఆనంద్ ఆడిన మ్యాచ్ ల వివరాలు:

  • మొదటి రౌండ్ లో ఆర్యన్ తారీ (నార్వే)పై విజయం
  • రెండో రౌండ్‌లో సో (అమెరికా)తో డ్రా
  • మూడో రౌండ్‌లో వెసెలిన్ టోపలోవ్‌(బల్గేరియా) పై విజయం
  • నాలుగో రౌండ్ లో తైమూర్ రాడ్జాబోవ్‌ (అజెర్ బాయిజాన్ )తో డ్రా
  • ఐదో రౌండ్ లో అనిష్ గిరి (నెదర్లాండ్స్) చేతిలో ఓటమి
  • ఆరో రౌండ్ లో హావో వాంగ్ (చైనా)తో డ్రా
  • ఏడో రౌండ్ లో కార్ల్ సేన్ (నార్వే)పై విజయం
  • ఎనిమిదో రౌండ్ లో షఖ్రియార్ మమెద్యరోవ్‌(అజెర్ బాయిజాన్ )తో డ్రా
  • తొమ్మిదో రౌండ్‌లో మాక్సిమ్ వాచియర్-లాగ్రేవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి

ఆరున్నర పాయింట్లతో అమెరికా ఆటగాడు సో వెస్లీ మొదటి స్థానంలో ఉండగా, మాగ్నస్ కార్ల్ సేన్ ( నార్వే) ఐదున్నర, నెదర్లాండ్స్  ప్లేయర్ అనీష్ గిరి ఐదు పాయింట్లతో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్