Sunday, September 29, 2024
Homeసినిమాఈ గెలుపు  ఒంటరిగా సాధించింది కాదు: కమల్

ఈ గెలుపు  ఒంటరిగా సాధించింది కాదు: కమల్

Its not my own:  కమలహాసన్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘విక్రమ్‘ సినిమా, జూన్ 3వ తేదీన థియేటర్లకు రానుంది. తెలుగులో ఈ సినిమా నితిన్ సొంత బ్యానర్లో రిలీజ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమలహాసన్ మాట్లాడుతూ … ” దాదాపు 40 .. 45 సంవత్సరాల క్రితం అక్కినేని నాగేశ్వరరావు హీరోగా చేసిన ‘శ్రీమంతుడు’ సినిమాకి డాన్స్ అసిస్టెంట్ గా హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటివరకూ నేని ఇక్కడి ఫుడ్ తింటూనే ఉన్నాను. తెలుగు ఇండస్ట్రీ .. తెలుగు ప్రేక్షకులు నాకు వరుస విజయాలను ఇచ్చారు. అందరూ నా గురించి మాట్లాడుతుంటే .. నేను ఇన్ని సాధించినా? అనిపిస్తుంది. ఒకవేళ సాధించి ఉంటే అది నేను ఒంటరిగా సాధించింది కాదు.

బాలచందర్ గారి దర్శకత్వంలో 36 సినిమాలు చేశాను .. అది నా పీహెచ్ డీ. నా దృష్టిలో బాలచందర్ గారు గొప్ప ఆర్టిస్ట్. నేను ఎలా చేయాలని చెప్పింది .. రజనీకాంత్ గారు ఎలా చేయాలని చెప్పింది .. చివరికి నాగేశ్ గారు చేసింది కూడా బాలచందర్ గారు చెప్పిందే. ఇంతవరకూ తెలుగు ప్రేక్షకులు నాకు ఎక్కువ హిట్స్ ఇస్తూ వచ్చారు. అలాగే ఈ సినిమాను కూడా హిట్ చేస్తారని భావిస్తున్నాను. అనిరుధ్ ఈ సినిమాకి మంచి సంగీతాన్ని ఇచ్చాడు. మనిషి సన్నగా ఉంటాడుగానీ .. మాట్లాడితే అమితాబ్ వాయిస్ లా ఉంటుంది. ఈ స్టేజ్ పై ఉన్న వాళ్లందరికీ ఏదో ఒక బ్యాక్ గ్రౌండ్ ఉంది .. కానీ లోకేశ్ కనగరాజ్ వెనుక ఎవరూ లేరు. కానీ ఇక నుంచి ఆయన వెనుక అందరూ ఉంటారు.

ఈ వేదికపై నితిన్ కి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నితిన్ పరిగెత్తవలసింది కమల్ హాసన్ తో కాదు .. వెంకటేశ్ తో. వెంకటేశ్ లా కష్టపడితే ఆయన  నెక్స్ట్ సూపర్ స్టార్ కాగలడు. చెన్నై .. ఆంధ్రాకి ఇచ్చిన గిఫ్టులలో  వెంకీ ఒకరు. ఈ ఫంక్షన్ కి వచ్చినందుకు నేను వెంకటేశ్ కి థ్యాంక్స్ చెప్పలేను .. ఎందుకంటే ఇది ఆయన ఫంక్షన్ .. అంటే నా ఫంక్షన్ అనే అర్థం. విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ తో కలిసి పనిచేస్తుంటే, నా బ్రదర్స్ తో కలిసి పనిచేస్తున్నట్టుగానే అనిపించింది. ఇకపై మన సినిమాలు పాన్ ఇండియా కాదు .. పాన్ వరల్డ్ సినిమాలుగా రావాలి. మీరు మంచి పిక్చర్స్ కావాలంటే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మంచి సినిమాకి నేను ఎప్పుడూ అభిమానినే ” అంటూ చెప్పుకొచ్చారు.

Also Read : కమల్ హాసన్ ‘విక్రమ్’ ట్రైలర్‌ లాంచ్ చేసిన చరణ్  

RELATED ARTICLES

Most Popular

న్యూస్