Saturday, November 23, 2024
HomeTrending Newsమరో రెండు నెలల్లో హైదరాబాద్ లో నీర కెఫే

మరో రెండు నెలల్లో హైదరాబాద్ లో నీర కెఫే

Neera Cafe : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన నీరా పాలసీలో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో సుమారు 10 కోట్ల రూపాయల తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నీరా కేఫ్ పనులను  అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు కుల వృత్తులను నిర్లక్ష్యం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టామన్నారు. ఆరోగ్య ప్రదాయిని నీరాను ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దివ్య ఔషధం ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రతిష్టాత్మకమైన నీరా కేఫ్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని టూరిజం MD మనోహర్ ను మంత్రి ఆదేశించారు. నీరా కేఫ్ పనులను పూర్తి చేసి ఆగస్టు నెలలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నా మన్నారు. అలాగే నీరా ఉత్పత్తి , అనుబంధ ఉత్పత్తుల తయారీ యూనిట్లను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో నీరా కేఫ్ పూర్తి అయిన తరువాత అన్ని జిల్లా లలో త్వరలోనే నీరా కేఫ్ లను నిర్మిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

Also Read : బెస్ట్ టూరిజం స్పాట్‌గా పాలమూరు : మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్