Saturday, November 23, 2024
HomeTrending Newsమాది రైతు ప్ర‌భుత్వం : సీఎం కేసీఆర్‌

మాది రైతు ప్ర‌భుత్వం : సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల ప్ర‌భుత్వ‌మ‌ని ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీస్ కమిషనరేట్, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సిద్దిపేట నుంచే ప్రారంభం అయిందన్నారు. తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట అండగా ఉందని గుర్తు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలోనే పుట్టి పెరిగానని.. తాను పుట్టిపెరిగిన సిద్దిపేటలో తొలి కలెక్టరేట్‌ సముదాయం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సిద్దిపేట జిల్లా ప్రజలకు సీఎం హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఇలాంటి అభివృద్దే తెలంగాణ కోరుకుంది..
సమైక్య పాలనలో నీటి సమస్యతో తెలంగాణ ఇబ్బంది పడిందన్నారు. ఆ రోజుల్లో బావులను, బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్లతో నీటిని అందించామని గుర్తు చేసుకున్నారు. ఆ రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందన్నారు. ప్రస్తుతం చెరువులన్నీ నిండాయని, ఇలాంటి అభివృద్ధినే తెలంగాణ కోరుకుందని చెప్పారు. మే నెలలో కూడా చెరువులు అలుగు పారుతున్నాయని.. హల్దీ, కూడవెళ్లి వాగులు ఏప్రిల్, మే నెలల్లోనూ పొంగిపొర్లాయన్నారు. వీటి కోసమే తెలంగాణ సాదించుకున్నామని.. అందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.

గోదాముల సామ‌ర్థ్యం 25 ల‌క్ష‌ల ట‌న్నుల‌కు పెంపు..
పాల‌నా సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసిన‌ట్లు సీఎం తెలిపారు. తెలంగాణ‌లో ఈ ఏడాది 3 కోట్ల ట‌న్నుల వ‌రి ధాన్యం పండిందన్నారు. గతంలో రాష్ట్రంలో గోదాముల స‌మ‌స్య ఉండేద‌ని.. గ‌తంలో 4 ల‌క్ష‌ల ట‌న్నుల సామ‌ర్థ్యం ఉన్న గోదాములు మాత్ర‌మే ఉన్నట్లు తెలిపారు. ప్ర‌స్తుతం గోదాముల సామ‌ర్ధ్యాన్ని 25 ల‌క్ష‌ల ట‌న్నుల‌కు పెంచిన‌ట్లు వెల్ల‌డించారు. దేశంలో ఎక్క‌డాలేని విధంగా రైతు వేదిక‌లు ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం భూములు 2.75 కోట్ల ఎక‌రాలు కాగా వీటిలో రైతుల వ‌ద్ద కోటిన్న‌ర వ‌ర‌కు భూములు ఉన్నట్లు తెలిపారు. ప్ర‌తి 5 వేల ఎక‌రాల‌ను క్ల‌స్ట‌ర్‌గా విభ‌జించి ప్ర‌త్యేక అధికారిని నియ‌మించిన‌ట్లు చెప్పారు. ప్ర‌పంచంలో ప్ర‌స్తుతం అద్భుత‌మైన క‌లుపు మందులు ఉన్న‌ట్లు తెలిపిన సీఎం ఒక్క‌సారి క‌లుపు మందు పిచికారీ చేస్తే మ‌ళ్లీ గ‌డ్డి మొల‌కెత్తే ప‌రిస్థితి ఉండ‌ద‌న్నారు. క‌లుపు మొక్క‌లు లేక‌పోతే పంట దిగుబ‌డి ఎక్కువ‌గా వ‌స్తోంద‌న్నారు.

ధ‌ర‌ణితో భూ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం..
ధ‌ర‌ణితో రైతుల భూ స‌మ‌స్య‌లు తీరిపోతున్నాయని సీఎం అన్నారు. ఒక్క ధ‌ర‌ణి పోర్ట‌ల్ కోసం మూడేళ్లు క‌ష్ట‌పడ్డ‌ట్లు తెలిపారు. ఇప్పుడు ధ‌ర‌ణి ద్వారా 6 ల‌క్ష‌ల రిజిస్ట్రేష‌న్లు జ‌రిగాయ‌న్నారు. రాష్ట్రంలో 93.5 శాతం మంది చిన్న‌, స‌న్న‌కారు రైతులేన‌ని చెప్పారు. ధ‌ర‌ణిలో న‌మోదైన భూమి హ‌క్కులు తొల‌గించే అధికారం ఎవ‌రికీ లేదన్నారు. నకిలీ విత్త‌నాల‌పై రాష్ట్రంలో ఉక్కుపాదం మోపిన‌ట్లు వివ‌రించారు. ప్ర‌పంచంలో ఎక్క‌డాలేని విధంగా రైతు బీమా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ద‌ళారుల ప్ర‌మేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే రైతుబంధు జ‌మ‌చేస్తున్న‌ట్లు చెప్పారు. రైతుబంధు 95 శాతం స‌ద్వినియోగం అవుతోందని సీఎం వెల్ల‌డించారు.

స‌ర్పంచ్‌ల‌కే డ‌బ్బులు అంద‌జేయండి..
ఏ ఊరిలో స‌ర్పంచ్ ఆ ఊరిలో ప‌నులు చేసుకుంటారు. స‌ర్పంచ్‌ల‌కే డ‌బ్బులు అంద‌జేయండని సీఎం కేసీఆర్ అన్నారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ప్ర‌స్తుతం 56 శాతం ప్ర‌స‌వాలు జ‌రుగుతున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ తెచ్చిన రూ.2 కిలో బియ్యం త‌న‌కు బాగా న‌చ్చిన ప‌థ‌కం అన్నారు. రూ.2 కిలో బియ్యంతో ఆక‌లి చావులు త‌గ్గాయన్నారు. తెలంగాణ ప‌త్తి ఎంతో నాణ్య‌మైన‌ద‌న్నారు. రాష్ట్రంలో ఎంత ప‌త్తి పండినా అమ్మ‌డుపోతుందన్నారు. తెలంగాణ‌లో 400 జిన్నింగ్ మిల్లులు ఉన్న‌ట్లు తెలిపారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్