ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మంగళవారం జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, ఇతర నేతలు ఢిల్లీలో భేటి అయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ పటిష్టత కోసం నేతలు అందరు కలిసి కట్టుగా పని చేయాలని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. కార్పోరేటర్ స్థాయి నుంచి ఎంతో మంది నేతలు కేంద్రమంత్రుల స్థాయి వరకు ఎదిగారని, కష్టపడి పనిచేస్తే పార్టీలో గుర్తింపు ఉంటుందని ప్రధాని మోడీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు భరోసా ఇచ్చారు.
రాబోయే వివిధ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయాలని కార్పొరేటర్లకు ప్రధానమంత్రి దిశానిర్దేశం చేశారు. జీహెచ్‌ఎంసీలో స్థానికంగా కార్పొరేటర్లదే కీలకపాత్ర కావడం తెలిసిందే. ప్రజల స్థానిక సమస్యలు వారికే బాగా తెలుస్తాయి. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండేదీ కార్పొరేటర్లే అయినందున, వారి సేవల్ని తగిన విధంగా వినియోగించుకోవడం ద్వారా అటు ప్రజలకు తగిన మేలు చేయడంతో పాటు ఇటు పార్టీ బలోపేతానికీ అవకాశముంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
Also Read : సవాళ్ళు ఎదుర్కునేందుకు భారత్ సిద్దం – మోడీ