Wednesday, November 27, 2024
HomeTrending Newsటీఆర్‌ఎస్‌ పాలనలోనే ప్రగతి పథం : మంత్రి ఎర్రబెల్లి

టీఆర్‌ఎస్‌ పాలనలోనే ప్రగతి పథం : మంత్రి ఎర్రబెల్లి

టీఆర్‌ఎస్‌ పాలనలోనే గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గొల్లూరులో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రులు.. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. మిషన్ భగీరథ నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం అంశాల వారీగా గ్రామాభివృద్ధిపై సమీక్షించారు.

గ్రామానికి మిషన్ భగీరిథ నీరు వస్తుందా? ట్రాక్టర్ గ్రామంలో ఎన్ని గంటల నుంచి తిరుగుతున్నది? డంపింగ్ యార్డు పని చేస్తున్నదా? తడి పొడి చెత్త వేరు చేసి ఎరువులు తయారు చేస్తున్నారా? ఎంత మేర ఆదాయం సమకూరుతుంది? వైకుంఠ ధామం పనిలోకి వచ్చిందా? వినియోగిస్తున్నారా? సంక్షేమ పథకాలు వస్తున్నాయా? వంటి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామం నుంచి బడి పిల్లల కోసం బస్ ను వేయిస్తామమని చెప్పారు. గొల్లూరులో మహిళలకు స్త్రీ నిధి కింద రూ.3 లక్షల వరకు నిధులు అందజేస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గ్రామానికి సంక్షేమ పథకాలు అన్నీ కలిపి కోటి రూపాయలను ప్రభుత్వం ఇస్తున్నది.

గతంలో ఇలా ఎప్పుడైనా వచ్చిందా? గత ప్రభుత్వాలు ఏమి చేశాయి? ఈ ప్రభుత్వం ఏమి చేసింది? అనే విషయాన్ని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. 70 ఏళ్ల నుంచి కానిది ఎనిమిదేండ్లలో సాధించి చూపారని ఆయన ప్రశంసించారు.కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని సర్వ నాశనం చేస్తుండగా కేసీఆర్‌ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపి జి రంజిత రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read : పల్లెల్లో అభివృద్ధి వెలుగులు – మంత్రి ఎర్రబెల్లి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్