Its Ausies: శ్రీలంకతో జరిగిన రెండో టి 20మ్యాచ్ లోనూ ఆసీస్ విజయం సాధించింది. మొదటి మ్యాచ్ లో ఏకపక్ష విజయం సాధించిన ఆసీస్ రెండో మ్యాచ్ లో ఏడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.
శ్రీలంక 7పరుగులకే ఓపెనర్లు నిశాంక(3); గుణతిలక(4) వికెట్లు కోల్పోయింది. అసలంక, కుశాల్ మెండీస్ లు మూడో వికెట్ కు 66పరుగులు జోడించారు. అసలంక-39; మెండీస్-36పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత రాజపక్ష-13; కెప్టెన్ శనక -14; హసరంగ-12 స్కోరు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు చేసింది.ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ -4; జయ్ రిచర్డ్సన్-3; మాక్స్ వెల్- 2 వికెట్లు పడగొట్టారు.
ఆసీస్ 33పరుగుల వద్ద తొలి వికెట్ (ఆరోన్ పించ్-24) కోల్పోయింది. మిచెల్ మార్ష్ -11; స్టీవ్ స్మిత్-5 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆ కాసేపటికే వార్నర్ (21) కూడా రనౌట్ అయ్యాడు. గ్లెన్ మాక్స్ వెల్ 19పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. స్టోనిస్-9 చేయగా, ఆస్టన్ అగర్ డకౌట్ అయ్యాడు. మాథ్యూ వాడే -26 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును గెలిపించాడు. జయ్ రిచర్డ్సన్ కూడా 9పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.17.5 ఓవర్లలో ఆసీస్ లక్ష్యం సాధించింది.
లంక బౌలర్లలో హసరంగ 4; దుష్మంత చమీర, నువాన్ తుషార చెరో వికెట్ పడగొట్టారు.
మాథ్యూ వాడే కు’ మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
జూన్ 11న మూడో టి20 పల్లెకలే లో జరగనుంది.
Also Read : తొలి టి 20లో లంకపై ఆసీస్ ఘనవిజయం