భారత్లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజే 7,240 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఎనిమిది మంది మృతిచెందారు. దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 7,240 మంది వైరస్ బారినపడ్డట్లు తేలింది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 3,591 మంది కోలుకున్నారు.. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.71 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.08 శాతం వద్ద ఉంది.
మహారాష్ట్రలో 2701 కేసులు నమోదు అయ్యాయి. కేరళ, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షలు పెంచాలని ICMR సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ఖచ్చితంగా ధరించేలా చర్యలు చేపట్టాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
మొత్తం కరోనా కేసులు:4,31,90,282
మొత్తం మరణాలు: 5,24,723
యాక్టివ్ కేసులు: 32,498
కోలుకున్నవారి సంఖ్య: 4,26,40,301
భారత్లో బుధవారం 15,43,748 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,59,81,691కు చేరింది. మరో 3,40,615 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
Also Read : ముంబై, కేరళలో భారీగా కరోనా కేసులు