World Covid Cases : ప్రపంచదేశాల్లో కరోనా కేసులు ఒక్కరోజే 5,91,610 కేసులు వెలుగుచూశాయి. మరో 1,649 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 53,80,10,527కు చేరింది. మరణాల సంఖ్య 63,26,416కు చేరింది. ఒక్కరోజే 5,03,412 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 50,93,52,180గా ఉంది.
మరోవైపు జీరో కోవిడ్ కేసులు లక్ష్యంగా చైనా చేపడుతున్న చర్యలపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, మందులు, అత్యవసర సరుకులు సమయానికి అందించని ప్రభుత్వం ఆంక్షలు మాత్రం కటినంగా అమలు చేస్తోందని బీజింగ్ లోని అనేక ప్రాంతాల్లో ప్రజలు బాల్కనీలు, కిటికీల వద్దకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నిరసనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. RTPCR పరీక్షలు, వాక్సినేషన్, కాంటైన్మేంట్ జోన్ లలో కేసులు వ్యాప్తి కాకుండా కట్టడి చేయటం తదితర వ్యవహారాలతో స్థానిక ప్రభుత్వాలకు ఖర్చు తలకు మించిన భారం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తగినంతగా నిధులు రాక, సుధీర్గ కాలం లాక్ డౌన్ లతో వ్యాపారం, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయి స్థానిక ప్రభుత్వాలకు ఆదాయం తగ్గిపోయింది. కేసులు అసలే లేని ప్రాంతాల్లో కూడా టెస్టులు, కట్టడి పేరుతో లాక్ డౌన్ విధించటంతో జిన్ పింగ్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో 96848 కొత్త కేసులు, 339 మరణాలు వెలుగుచూశాయి.
తైవాన్లో 83,223 కొవిడ్ కేసులు, 159 మంది ప్రాణాలు కోల్పోయారు.
బ్రెజిల్లో 49,614 మంది వైరస్ బారిన పడ్డారు. 301 మంది చనిపోయారు.
జర్మనీలో 42వేలు, ఉత్తర కొరియాలో మరో 54వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
Also Read : ముంబై, కేరళలో భారీగా కరోనా కేసులు