Sunday, April 6, 2025
Homeసినిమా‘పక్కా కమర్షియల్’ ట్రైలర్‌కు అనూహ్య స్పందన

‘పక్కా కమర్షియల్’ ట్రైలర్‌కు అనూహ్య స్పందన

Trailer Out: యాక్ష‌న్ హీరో గోపీచంద్, యూత్ ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. మూసాపేట్‌లోని ఏసియన్ సినిమాస్‌లో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.

‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ అంతా పక్కా కమర్షియల్ కోణంలో ఉంది. రాశీ ఖన్నా డైలాగ్స్ కూడా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సత్యరాజ్, రావు రమేష్ పాత్రలు విభిన్నంగా డిజైన్ చేశారు మారుతి. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read : జులై 1న గోపీచంద్ ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్