Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ప్రో లీగ్ పురుషుల హాకీ: బెల్జియం గెలుపు

ప్రో లీగ్ పురుషుల హాకీ: బెల్జియం గెలుపు

FIH Pro-league: ప్రో లీగ్ పురుషుల హాకీ టోర్నమెంట్ లో భాగంగా ఇండియా-బెల్జియం జట్ల మధ్య నేడు జరిగిన రెండో మ్యాచ్ లో  బెల్జియం 3-2 తేడాతో విజయం సాధించింది.

బెల్జియం లోని అంట్వేర్ప్ లో జరిగిన ఈ మ్యాచ్ 25వ నిమిషంలో ఇండియాకు అభిషేక్ తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత 33, 49, 59 నిమిషాల్లో బెల్జియం మూడు గోల్స్ చేసి 3-1 ఆధిక్యంలో నిలిచింది. ఆట చివరి నిమిషంలో మన్ దీప్ సింగ్ ఇండియాకు మరో గోల్ అందించి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించగాలిగాడు.

బెల్జియంతో జరిగిన నిన్నటి మ్యాచ్ లో షూటౌట్ తో గట్టెక్కిన ఇండియా నేడు ఓటమి పాలైంది.

ఈ విజయంతో బెల్జియం ఇండియాను అధిగమించి రెండో స్థానంలోకి చేరింది. నెదర్లాండ్స్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, ఇండియా ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఇండియా తన తర్వాతి మ్యాచ్ లను నెదర్లాండ్స్ తో జూన్ 18,19 తేదీల్లో ఆడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్