Tuesday, September 24, 2024
HomeTrending Newsఏం చేశారో చెప్పండి: కేశవ్ డిమాండ్

ఏం చేశారో చెప్పండి: కేశవ్ డిమాండ్

Answer this:  అనంతపురం జిల్లాకు ప్రాణాధారమైన హంద్రీనీవా ప్రాజెక్టు కింద చేపట్టబోయే కాల్వలకు సంబంధించి  ఈ  మూడేళ్ళలో కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేకపోయారని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. పలు రిజర్యాయర్లకు సిఎం జగన్ వర్చువల్ గా శంఖుస్థాపన చేసినా పనులు  ప్రారంభం కాలేదని మండిపడ్డారు. పథకాలకు బటన్ నొక్కి నిధులు విడుదల చేయడం కాదని, జీవితాల్లో ఎలాంటి మార్పు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.  రేపు అనంతపురం జిల్లా సీకేపల్లిలో రైతు బీమా పథకం కింద లబ్దిదారుల అకౌంట్లలో నిధులు జమ చేసే కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొననున్నారు.  ఈ సందర్భంగా పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ నిధులు సకాలంలో విడుదల చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను సిఎం అమలు చేయలేకపోయారని పేర్కొన్నారు.

రైతుల తరఫున ఇన్సూరెన్స్ ఈ ప్రభుత్వం కట్టడం లేదని, రైతులను కట్టుకోనీయడం లేదని, దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని కేశం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ-క్రాపింగ్ బుకింగ్ పంట పొలం మీద ఉన్నప్పుడు చేయాలని కానీ ఈ ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినప్పుడు చేస్తామని చెప్పడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. సకాలంలో ఈ క్రాప్ బుకింగ్ చేయకపోవడం వల్ల రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన  ప్రీమియం కట్టుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని, ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఒక్క రూపాయి కూడా ఇంటికి తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఈ మూడేళ్ళ కాలంలో అనంతపురం జిల్లా రైతాంగానికి మీరు ఏమి మేలు చేశారో సభా ముఖంగా చెప్పాలని పయ్యావుల సవాల్ చేశారు.

ఖంగా చెప్పాలని పయ్యావుల సవాల్ చేశారు.

Also Read ఏ సమస్యలు లేవా? ప్రభుత్వంపై కేశవ్ విసుర్లు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్