Agni Row: దేశవ్యాప్తంగా సాగుతోన్న అగ్నిపథ్ మంటలు తెలంగాణకు కూడా తాకాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పలు రైళ్లకు యువకులు నిప్పు పెట్టారు. తొలుత పెద్ద సంఖ్యలో స్టేషన్ లోకి చేరుకున్న ఆందోళనకారులు ఫర్నీచర్, షాపుల అద్దాలు, సిసి టివి కెమెరాలు పగలగొట్టారు. రైల్వే ట్రాక్ లపై బస్తాలు, టూ వీలర్లు వేసి నిప్పంటించారు. ఆ తర్వాత స్టేషన్ లో ఆగి ఉన్న పలు రైళ్ళలోకి ప్రవేశించి బోగీలకు నిప్పు పెట్టారు. తీవ్ర భయాందోళనలకు గురైన ప్రయాణికులు స్టేషన్ నుంచి పరుగులు తీశారు.
వెంటనే రైల్వే రక్షక దళం రంగంలోకి దిగి ఫైరింజన్ల తో మంటలు అదుపులోకి తెచ్చారు. అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేపట్టినా నిరసనకారులు పోలీసులపై రాళ్ళు రువ్వి హంగామా సృష్టించారు.
మూడేళ్ళ క్రితం ఆర్మీ పరీక్షలు నిర్వహించి కోవిడ్ నెపంతో ఇప్పటి వరకూ తుది ఫలితాలు ఇవ్వలేదని, వెంటనే తమను ఉద్యోగాల్లో చేర్చుకోవాలని నినాదాలు చేశారు.
Also Read : బీహార్లో వెల్లువెత్తిన నిరసనలు.. రైళ్ళు దగ్ధం