Wednesday, November 27, 2024
HomeTrending Newsఆగస్ట్ నుంచి కొత్త పెన్షన్లు: కేటియార్

ఆగస్ట్ నుంచి కొత్త పెన్షన్లు: కేటియార్

New Pensions: ఆగస్ట్ నుంచి కొత్త పెన్షన్లు అందిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటిఆర్  ప్రకటించారు. కేసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.  దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణాలో ఉన్నాయని చెప్పారు. కొల్లాపూర్ లో పర్యటించిన కేటిఆర్ పట్టణంలో నిర్మించనున్న కేసీఆర్ బీసీ కాలనీ, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్, జంక్షన్ల అభివృద్ధి, రోడ్డు డివైడర్ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక పీజీ కాలేజ్ లో  4 కోట్లరూపాయలతో నిర్మించిన మహిళా వసతి గృహాన్ని  ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కేటిఆర్ వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగిస్తూ  రాష్ట్ర ఏర్పడగానే విద్యుత్, నీటి సమస్యలు పరిష్కరించుకోగాలిగామన్నారు.  వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామన్నారు. అగ్నిపథ్ ఆందోళనలను కూడా కేటిఆర్ ప్రస్తావించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన అనాలోచిత విధానాలతో దేశాన్ని రావణకాష్టంలా మార్చిందని ఆరోపించారు.  స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని హామీ ఇచ్చారని, జన్ ధన్ ఖాతాలు తెరుచుకోవాలని కూడా ప్రకటించి మాట మార్చారని విమర్శించారు.

కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మవద్దని,  కాంగ్రెస్ కాలం చెల్లిన మందు లాంటిదని, అలాంటి పార్టీ తెలంగాణను ఉద్దరిస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు.  ఒక్క ఛాన్స్ ఇవ్వండని రాహుల్ గాంధీ అడుగుతున్నారని, కానీ కాంగ్రెస్ కు ఇప్పటికే పది సార్లు ఛాన్సులు ఇచ్చి చూసహామని ఎద్దేవా చేశారు.  5 తరాల పాటు, 5 దశాబ్దాలు అవకాశామిచ్చామని , 50 ఏళ్లు చాన్సులిస్తే .. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరు కాదా అని దుయ్యబట్టారు.

Also Read : ఆందోళనలు కనువిప్పు : కేటిఆర్ ట్వీట్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్