ఇదిలా ఉంటే.. చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య.. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. ఈ వీటితో పాటు ఛలో, భీష్మ చిత్రాల దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా సినిమా చేసేందుకు చిరంజీవి ఓకే చెప్పారు. ఈ భారీ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మించనున్నారు. ఈ సినిమా తరువాత వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయనున్నట్టు ఒక వార్త బలంగానే వినిపిస్తోంది.
దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఆరంభమైందని సమాచారం. వినాయక్ పై చిరంజీవికి విపరీతమైన నమ్మకం ఉంది. తన స్టైల్, తన నుంచి అభిమానులు కోరుకునే అంశాలు వినాయక్ కి బాగా తెలుసును గనుక, ఆయనకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది. ఇదే కనుక నిజమైతే.. ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే.. అభిమానులకు పండగే.