Angry with Mass: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మలినేని గోపీచంద్ తో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ భారీ చిత్రం దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ తర్వాత బాలయ్య.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఇటీవల ఈ భారీ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. జులై ఫస్ట్ వీక్ నుంచి అనిల్ రావిపూడి దర్శకత్వం లో కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
అయితే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతోంది. అదేమిటంటే.. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారట. బాలయ్య బాబు ఈ సినిమాలో 45 ఏళ్ల పైబడిన ఒక వ్యక్తిగా అలాగే ఒక 18 ఏళ్ళ కూతురికి తండ్రిగా కూడా కనిపించబోతున్నాడు. అయితే.. ఆయనకు మంచి స్నేహితుడి పాత్ర కోసం రాజశేఖర్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం.
రాజశేఖర్ ఏ సినిమా చేసినా కూడా ఆయన వాయిస్ కు సాయికుమార్ డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం రాజశేఖర్ ఒరిజినల్ వాయిస్ తోనే మ్యాజిక్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారట. బాలయ్యబాబు, రాజశేఖర్ కలిసి నటిస్తున్నారనేది ఆసక్తిగా మారింది. ఇది కనుక నిజమైతే.. ఈ మూవీకి మరింత క్రేజ్ రావడం ఖాయం.
Also Read : బాలయ్య, అనిల్ రావిపూడి మూవీ స్టోరీ ఇదే.