Girls on Top: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. కృష్ణా జిల్లా 72 శాతంతో ప్రథమ స్థానంలో, 50 శాతంతో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు జూన్ 25-జూలై 5 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని బొత్స తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్ట్ 3నుంచి12 వరకూ రోజుకు రెండు చొప్పున నిర్వహిస్తామని వెల్లడించారు.
పదో తరగతి ఫలితాల్లోలాగే ఇంటర్ లో కూడా ఈసారి ఉత్తీర్ణతా శాతం తగ్గింది. హాజరైన విద్యార్ధులు, ఉత్తీర్ణుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- హాజరైన మొత్తం విద్యార్ధులు- 9,41,358
- ఇంటర్ ఫస్టియర్ – 4,45,604
ఫస్టియర్ పాస్ అయినవారు 2,41,599;
మొత్తం పాస్ శాతం-54 (బాలురు-49; బాలికలు-65 ) - ఇంటర్ సెకండియర్- 4,23,455
సెకండియర్ పాస్ అయినవారు 2,58,449;
మొత్తం పాస్ శాతం-61 (బాలురు-54; బాలికలు-68 ) - వొకేషనల్ హాజరైనవారు 72, 299
మొదటి సంవత్సరం పాస్ శాతం- 45
రెండో సంవత్సరం పాస్ శాతం -55
Also Read : విద్యార్ధులు నష్టపోకుండా చర్యలు: బొత్స