India at 3rd: ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రోలీగ్ హాకీ టోర్నమెంట్ 2021-22 సీజన్ ను భారత మహిళా జట్టు విజయంతో ముగించింది. నిన్న అమెరికాతో జరిగిన మొదటి మ్యాచ్ ను 5-0తో గెలుచుకున్న ఇండియా నేడు జరిగిన రెండో మ్యాచ్ లో 4-0తో విజయం సాధించింది.
నేడు ఆట 39వ నిమిషంలో వందన కటారియా పెనాల్టీ కార్నర్ ద్వారా తొలి గోల్ సాధించి బోణీ చేసింది, 54వ నిమిషంలో మరో ఫీల్డ్ గోల్ సాధించి ఇండియా ఆధిక్యాన్ని 2-0కు చేర్చింది వందన. అదే సమయం వద్ద సోనిక మరో గోల్ సాధించింది. 57వ నిమిషంలో సంగీతా కుమారి మరో ఫీల్డ్ గోల్ చేసి 4-0 ఆధిక్యం సంపాదించింది. ఆట ముగిసే సమయానికి అమెరికా గోల్ చేయలేకపోవడంతో ఇండియా విజయం సొంతం చేసుకుంది.
మొత్తం 9 దేశాలు పాల్గొన్న ఈ టోర్నీ అధికారికంగా మరో రెండు రోజుల్లో ముగియనుంది, అయితే ఇప్పటికే అర్జెంటీనా ఛాంపియన్ గా కప్ సొంతం చేసుకుంది. మిగిలిన మ్యాచ్ లు నామమాత్రమే కానున్నాయి.
నెదర్లాండ్స్ రెండో స్థానంలో ఉండగా, భారత మహిళల జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది,