Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్Target Olympics: క్రీడాకారులను తీర్చిదిద్దాలి: మంత్రి

Target Olympics: క్రీడాకారులను తీర్చిదిద్దాలి: మంత్రి

జనాభాలో ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న మనదేశం ఒలింపిక్ లో పతకాలు సాధించడంలో చివరిస్థానంలో ఉండటం విచారకరమని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక,  సంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాసగౌడ్  అన్నారు. ఒలింపిక్స్ పతకాలు లక్ష్యం గా క్రీడాకారులను ప్రోత్సాహించి తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 36వ ఎడిషన్ ఒలింపిక్ డే రన్ -2022కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్  క్రీడల అభివృద్ధి కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. క్రీడల అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే సగానికిపైగా క్రీడా మైదానాలను పూర్తి చేసి ప్రారంభించామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అన్నిగ్రామాల్లో క్రీడా  ప్రాంగణాలను 100 శాతం పూర్తి చేశామన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ఆదేశాల మేరకు ఈ క్రీడా ప్రాంగణంలో కబడ్డీ కోర్టు, వాలి బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్ట్, క్రికెట్ కిట్స్ లను అందించి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు.

క్రీడలను రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులను ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నా మన్నారు. ఇటీవల బాక్సింగ్, షూటింగ్ లో ప్రపంచ స్థాయి లో పతకాలు సాధించిన నిక్కత్ జరీన్, ఇషా సింగ్ లకు చెరో 2 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహకాల ను , గ్రూప్ 1 ఉద్యోగాలను సీఎం కేసీఆర్ అందించారన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఉన్నాయన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా, మండల, గ్రామీణ స్థాయిలో సమన్వయం చేసుకుంటూ క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. వచ్చే ఒలింపిక్ డే రన్ ను సుమారు 50వేల మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి క్రీడాకారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. వేణుగోపాల చారి, రాష్ట్ర క్రీడా శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానీయా, రాష్ట్ర SATS చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, విద్యా మౌలిక సదుపాయాల కల్పన శాఖ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, బేవరేజ్ కార్పోరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్, డా. P వెంకటేశ్వర రెడ్డి, మర్రి లక్ష్మణ్ రెడ్డి,  ఒలింపిక్స్ ఎడ్వర్డ్, అర్జున అవార్డు గ్రహీత లు , ఇతర క్రీడా సంఘాల ప్రతినిధులు, SATs అధికారులు ధనలక్ష్మి, సుజాత, డా. హరికృష్ణ, దీపక్ , పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, పల్లె లక్ష్మణరావు గౌడ్, అంబాల నారాయణ గౌడ్, వేములయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్