Saturday, November 23, 2024
HomeTrending Newsమహారాష్ట్రలో బిజెపి పద్మవ్యూహం

మహారాష్ట్రలో బిజెపి పద్మవ్యూహం

మహారాష్ట్రలో పరిణామాలు శివసేనకు ప్రాణసంకటంగా మారాయి. అసమ్మతి ఎమ్మెల్యేల వైపు బలం పెరుగుతూ ఉండటం.. లోపాయికారిగా బిజెపి సహకరించటం మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి చివరి ఘడియలు తీసుకొచ్చాయి. బిజెపి జాతీయ నాయకత్వం పన్నిన పద్మవ్యూహంతో ఏ క్షణంలో నైనా బిజెపి అధికార పీటం చేజిక్కించుకునే అవకాశం ఉంది. మంత్రి వర్గ సమావేశం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షులతో అన్ని స్తాయిల నేతలతో ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే సమావేశం అవుతున్నారు. ఉద్దావ్ కు కరోనా సోకినా నేపథ్యంలో వర్చువల్ గా సమావేశం అవుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1గంటకు శివసేన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం..వర్చువల్ గా పార్టీ క్యాడర్ నుద్దేశించి‌ మాటాడనున్న ఉద్దవ్ థాకరే.

మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్న బిజెపి నేతలు. ఈ రోజు కేంద్రమంత్రి రామ్ దాస్ అథావాలేతో భేటీ కానున్న మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత  దేవేంద్ర ఫద్నవీస్. ఇంకా గౌహతీ లోనే రెబెల్ ఎమ్మెల్యే లు..40 కి చేరిన షిండే వర్గం + 10 independent MLA’s. డిస్ క్వాలిఫై చేయాల్సిన ఎమ్మెల్యే లపై న్యాయపరంగా ఎలా ప్రొసీడ్ అవ్వాలన్న దానిపై అర్ధరాత్రి వరకు అడ్వోకేట్ జనరల్ తో సమావేశమైన మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ,అధికారులు. అనర్హత వ్యవహారంలో కీలకంగా మారిన డిప్యూటీ స్పీకర్ నరహరి జల్వాలే నిర్ణయం. డిప్యూటీ స్పీకర్ NCP కి చెందిన వారు కావడంతో డిప్యూటీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే లు. సంక్షోభ పరిష్కారం కోసం ఉద్దవ్ థాకరేతో నిన్న అర్ధరాత్రి వరకు భేటీ అయిన శరద్ పవార్..అజిత్ పవార్.

Also Read :

ఇంతకీ ఎవరీ ఏకనాథ్ షిండే?

RELATED ARTICLES

Most Popular

న్యూస్