Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇద్దరి కాంబినేషన్లో మూవీ రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. అనౌన్స్ మెంట్ వచ్చి.. పూజా కార్యక్రమాలు జరిగి చాలా రోజులు అయ్యింది కానీ.. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. ఇదిగో కథ చెప్పేశాడు. అదిగో సెట్స్ పైకి వెళ్లిపోతుంది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి కానీ.. షూటింగ్ మాత్రం స్టార్ట్ కావడం లేదు.
తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఏంటంటే… త్రివిక్రమ్ చెప్పిన కథలో మహేష్ మార్పులు చేర్పులు చెప్పాడట. ఈ మార్పులు చేసే పనిలో ఉన్నాడట త్రివిక్రమ్. మహేష్.. ఫ్యామిలీతో వెకేషన్ గడిపి, మరో రెండు రోజుల్లో ఇండియాకు వస్తున్నారు. వచ్చిన తరువాత మహేష్ ముందుగా త్రివిక్రమ్ ఫైనల్ నేరేషన్ విని ఓకె చేయడం… వన్స్ అది ఓకె అయితే డైలాగ్ వెర్షన్ మొదలు పెడతారట త్రివిక్రమ్.
ఈ సినిమా సెట్ మీదకు వెళ్లాలి. వీలైనంత త్వరగా అది పూర్తి చేయాలి. ఆ వెంటనే రాజమౌళి సినిమాను మహేష్ ప్రారంభించాల్సి వుంటుంది. అప్పటి వరకు రాజమౌళి వెయిటింగ్ లో వుండాల్సిందే. ఫిబ్రవరి నాటికి మహేష్, త్రివిక్రమ్ సినిమా పూర్తవుతుందని అంచనా. ఈ లెక్కన ఈ మూవీ సంక్రాంతి రేసులో లేనట్టే. వచ్చే సమ్మర్ కి ఈ సినిమా విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. మరి.. త్రివిక్రమ్ మహేష్ తో ఎలాంటి సినిమా అందిస్తాడో..?
Also Read : మహేష్ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న త్రివిక్రమ్. ?