Business reforms: ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ తన అగ్రస్థానాన్ని ఈ ఏడాది కూడా నిలబెట్టుకుంది. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఏడు రాష్ట్రాల కేటగిరిలో ఏపీ మొదటి స్థానం దక్కించుకుంది. దీనిలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. 2020 బిజినెస్ యాక్షన్ రిఫార్మ్స్ లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలను టాప్ అచీవర్స్ కేటగిరీలో ఎంపిక చేశారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
టాప్ అచీవర్స్ కేటగిరీ లో… ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, హర్యానా, కర్నాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు
ది అచీవర్స్ కేటగిరీలో…. హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్
ఎమర్జింగ్ బిజినెస్ ఎకో సిస్టమ్స్ లో….. జమ్మూ, కాశ్మీర్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, పాండిచ్చేరి
ది ఆస్పైర్స్ లో…. అస్సాం, ఛత్తీస్ ఘర్, గోవా, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్….. రాష్ట్రాలు ఉన్నాయి.