శ్రీలంక- ఇండియా మహిళా క్రికెట్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్ లో ఇండియా 4 వికెట్లతో విజయం సాధించింది. శ్రీలంక ఆతిథ్యం ఇస్తోన్న ఈ సిరీస్ ఐసిసి ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతోంది. పల్లెకలేలో ని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
లంక జట్టులో నీలాక్షి డిసిల్వా-43; ఓపెనర్ హాసిని పెరీరా-37; మాధవి-28 పరుగులతో రాణించారు. 48.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ, రేణుకా సింగ్ చెరో మూడు; పూజా వస్త్రాకర్ రెండు; గయక్వాడ్, హర్మన్ ప్రీత్ కౌర్ చెరో వికెట్ పడగొట్టారు.
లక్ష్య సాధనలో ఇండియా 17 పరుగులకే రెండు వికెట్లు (స్మృతి మందానా-4; యస్తికా భాటియా-1) కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ హార్మన్ ప్రీత్-44; ఓపెనర్ షఫాలి వర్మ-35; హర్లీన్ డియోల్-34 పరుగులతో రాణించారు. చివర్లో దీప్తి శర్మ (22), పూజా వస్త్రాకర్ (21)లు నాటౌట్ గా నిలిచి విజయం అందించారు. 38ఓవర్లలో ఇండియా లక్ష్యం (176) చేరుకుంది.
ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన దీప్తి శర్మకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.
రెండో మ్యాచ్ ఇదే స్టేడియంలో జూలై 4న జరగనుంది.