Sunday, September 22, 2024
HomeTrending Newsమహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ రాహుల్ నర్వేకర్

మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ రాహుల్ నర్వేకర్

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరింది. గవర్నర్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సర్కారు బలనిరూపణ కోసం రెండు రోజుల ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు (జూన్ 3, ఆదివారం) అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరిగింది.  స్పీకర్ పదవి కోసం షిండే వర్గం అండతో బిజెపి నేత రాహుల్ నర్వేకర్ ను అభ్యర్థిగా నిలిపారు. శివసేన తరపున రాజన్ సాల్వి బరిలోకి దిగారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. రాహుల్ నర్వేకర్ కు అనుకూలంగా 164 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 107 ఓట్లు పడ్డాయి. స్పష్టమైన మెజార్టీ సాధించడంతో స్పీకర్ గా రాహుల్ ఎన్నికైనట్లు ప్రొసీడింగ్స్ నిర్వహించిన డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు.

తొలుత డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించి, స్పీకర్ ఎన్నిక ప్రక్రియను మొదలుపెట్టారు. సభకు హాజరైన సభ్యులు నిలబడి ఉండగా, తలలు లెక్కించే విధానంలో స్పీకర్ ఎన్నికను చేపట్టారు. బలాబలాల దృష్ట్యా స్పీకర్ గా రాహుల్ ఎన్నిక లాంఛనంగా మారింది. స్పీకర్ ఎన్నిక వేళ శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే తన వర్గం ఎమ్మెల్యేలతో సభకు హాజరయ్యారు. కాంగ్రెస్, ఎన్.సి.పి ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేశారు. బీఎస్పీ సభ్యులు ఇద్దరు ఓటింగ్ లో పాల్గొనకుండా సభలోనే కూర్చొండిపోయారు. కొత్త స్పీకర్ రాహుల్ ను సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ లు అభినందించారు.

మరోవైపు రెబెల్‌ నేత ఏక్‌నాథ్‌ శంబాజీ షిండేను శివసేన నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేరుతో ఆదివారం ఉదయం ఒక ప్రకటన వెలువడింది. కొత్త సీఎం షిండే రేపు(సోమవారం) బలపరీక్షకు సిద్ధపడగా, ఇవాళ పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంది. అయితే, ఈ నిర్ణయం షిండేకు వర్తించబోదని, అసలైన శివసేన పార్టీ తమదేనని, ఇప్పటికీ శాసనసభాపక్ష నేతగా షిండేనే కొనసాగుతున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్