In Parliament: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు నిర్వహించడం తెలుగుజాతికే కాకుండా దేశానికే గర్వకారణమని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు, ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ జరగడం సంతోషకరమన్నారు. ఇలాంటి మహనీయుడు అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులోనూ అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
“కళ్ళెదుట జరుగుతున్న అన్యాయాన్ని, అమాయక ప్రజల దోపిడీని ఎదిరించి చిన్నవయసులోనే ప్రాణాలను త్యాగమిచ్చారు అల్లూరి సీతారామరాజు. అటువంటి అల్లూరి 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుని ఆ మహానుభావుడికి నివాళులర్పించాల్సింగా తెలుగుప్రజలను, తెలుగుదేశం కార్యకర్తలను కోరుతున్నాను” అంటూ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
హైదరాబాద్ లోని తన నివాసంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ నివాళులు అర్పించారు.