Sai Dharam Tej: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ.. నిర్మించిన భారీ చిత్రం బింబిసార. ఈ చిత్రం ద్వారా వశిష్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై బింబిసార చిత్రం భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో బింబిసార ట్రైలర్ దూసుకెళుతుంది.
ఇదిలా ఉంటే.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బింబిసార ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఇంతకీ ‘సాయిధరమ్ తేజ్’ ఏమన్నారంటే… “హ్యాపీ బర్త్ డే కళ్యాణ్ రామ్ అన్న, బింబిసార ట్రైలర్ నచ్చింది. ఇంటెన్స్, రా, కొత్తగా ఉంది… ఇంకా ఇలాంటి ఎన్నో సక్సస్ ఫుల్ ఇయర్స్ రావాలని కోరుకుంటున్నాను” అన్నారు. అంతే కాకుండా దర్శకుడు వశిష్ట గురించి స్పందిస్తూ.. “ఇలాంటి సినిమా తీయడం చాలా సంతోషంగా ఉంది రా” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలా నందమూరి హీరో ట్రైలర్ గురించి మెగా హీరో స్పందించడం ఆసక్తిగా మారింది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై పై హారి కృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేథరిన్ థెరిస్సా, సంయుక్త మీనన్ కథానాయకలు. ఈ చిత్రానికి స్వరవాణి ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండగా, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్ 5, 2022 న బింబిసార ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. కళ్యాణ్ రామ్ చాలా కొత్తగా కనిపిసిస్తున్నాడు. మరి.. బింబిసార మూవీతో కళ్యాణ్ రామ్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.
Also Read : ‘బింబిసార’ ట్రైలర్ కు టెరిఫిక్ రెస్పాన్స్