ఎఫ్ ఐ హెచ్ ఆధ్వర్యంలో జరుగుతోన్న హాకీ మహిళల వరల్డ్ కప్ లో ఇండియా తన మూడో మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 4-3 తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్, చైనా తో జరిగిన లీగ్ మ్యాచ్ లు డ్రా గా ముగిసిన సంగతి విదితమే.
నేడు జరిగిన మ్యాచ్ 4వ నిమిషంలోనే వందనా కటారియా ఫీల్డ్ గోల్ తో ఇండియాకు తొలి పాయింట్ సంపాదించింది. 12, 29,33 నిమిషాల వద్ద న్యూ జిలాండ్ మూడు గోల్స్ చేసి పూర్తి ఆధిక్యం సంపాదించింది. 44వ నిమిషంలో ఇండియాకు లాల్ రెమ్సియామి మరో గోల్ అందించి స్కోరు 3-2కు తగ్గించగలిగింది. 54 వ నిమిషం వద్ద కివీస్ మరో గోల్ సాధించింది. ఆట చివరి నిమిషాల్లో ఇండియాకు గుర్జీత్ కౌర్ మరో గోల్ అందించింది. సమయం పూర్తయ్యే నాటికి న్యూ జిలాండ్ 4-3తో విజయం సాధించింది.
నాలుగు పూల్స్ నుంచి తొలి స్థానంలో నిలిచిన నెదర్లాండ్స్, న్యూజిలాండ్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. రెండు మూడు స్థానాల్లో నిలిచిన జట్లు క్రాస్ ఓవర్ మ్యాచ్ లు ఆడనున్నాయి.
ఇండియా తన తదుపరి మ్యాచ్ ను స్పెయిన్ తో 10వ తేదీన ఆడనుంది.