Sunday, November 24, 2024
HomeTrending Newsకల్వకుంట్ల అవినీతిని కక్కిస్తాం - ఎంపి అరవింద్

కల్వకుంట్ల అవినీతిని కక్కిస్తాం – ఎంపి అరవింద్

సర్వశిక్షా అభియాన్ లో కేంద్ర ప్రభుత్వం నుండి గత 4 సంవత్సరాలుగా కేంద్రం నుండి 800కోట్లకు పైగా నిధులు రాష్ట్రనికి వచ్చాయిని నిజామాబాద్ ఎంపీ అరవింద్ వెల్లడించారు. నిధుల్లో జగిత్యాల జిల్లా కు 35 కోట్లు వచ్చాయని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన దిశ కమిటీ సమావేశంలో ఈ రోజు ఎంపి అరవింద్ పాల్గొన్నారు. సమావేశంలో గైర్హాజరైన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల వైఖరిపై ఎంపీ అరవింద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు వస్తున్నా పాఠశాలల్లో మాత్రం పనుల కోసం నాయకులు నా దగ్గరకు వస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.  మరి నిధులు ఎమయ్యాయని ప్రశ్నించారు. పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం సరిగ్గా లేదని దిశ సభ్యులు పాఠశాల సందర్శించి పర్యవేక్షించాలని  ఆదేశించారు.

పసల్ బీమా యోజనలో జిల్లా రైతులు 3 కోట్ల ప్రీమియం కడితే 14 కోట్లు వచ్చాయిని జిల్లా లో NH రోడ్ల లో మరమ్మతు ల కోసం, 102 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించిందన్నారు. ఉమ్మడి జిల్లాలో 2016 నుండి distric re organaition fund కింద రోడ్ల కోసం 191 కోట్లు వచ్చాయి కానీ అధికారులు మాత్రము రాలేవు అని చెప్తున్నారని కెసిఆర్ కిట్ల లో 50శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్నారు. జిల్లాలో నిర్మాణం చేపట్టిన 35 చెక్ డ్యాంల్లో కేంద్ర నిధులతో నిర్మించారని ఎంపి చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం తిన్న ఆస్తులని కక్కిస్తామని అన్నారు. కేంద్రం నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయిని అధికారులు లెక్కలతో సహా తెలిపారని అందుకే ఎమ్మెల్యే లు సమావేశనికి రాలేదని వస్తే అధికారుల ముందు నల్ల మొఖం అవుతుందని ఎద్దేవా చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్