Saturday, November 23, 2024
HomeTrending Newsవిద్యారంగంలో ఒక యజ్ఞం చేస్తున్నాం: బొత్స

విద్యారంగంలో ఒక యజ్ఞం చేస్తున్నాం: బొత్స

Education reforms:  జాతీయ విద్యా విద్యానానికి అనుగుణంగా రాష్ట్రంలో విద్యా సంస్కరణలకు సిఎం జగన్ శ్రీకారం చుట్టారని,  రాష్ట్రంలో  నిరుపేదలకు ఉన్నత విద్య అందించేందుకు జగన్ ఒక యజ్ఞం చేస్తున్నారని  రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ ప్లీనరీ లో విద్యారంగంపై ప్రవేశ పెట్టిన తీర్మానంపై బొత్స మాట్లాడారు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన, ప్రభుత్వ స్కూళ్ళలో నాడు-నేడు, సంపూర్ణ పోషణ్ లాంటి ఎన్నో కార్యక్రమాలతో అంగన్ వాడీ నుంచే  చిన్నారుల వికాసానికి తమ ప్రభుత్వం బాటలు వేస్తోందన్నారు.

ఈ ప్రభుత్వం మనందరి ప్రభుత్వమని, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఈ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందని మీరు కూడా కోరుకున్నారని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు, ప్రభుత్వం, విద్యార్ధుల తల్లిదండ్రులు అందరం కలిసి రాష్ట్రాన్ని దేశంలోనే మేలైన రాష్ట్రంగా తీర్చి దిద్దడానికి కృషి చేద్దామని పిలుపు ఇచ్చారు. ఉపాధ్యాయులకు ఏవైనా వృత్తి పరమైన ఇబ్బందులుంటే వాటిని, సానుభూతితో, సానుకూల దృక్పథంతో పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. “ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే విద్య ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ ఆర్ధిక వ్యవస్థ ముందంజలో ఉంది. సమాజంలో చదువు అనేది ఒక జీవన భద్రతగా సమాజ గౌరవ, ఏ వ్యక్తీ తస్కరించలేని స్వార్జిత ఆస్తి, గౌరవం కల్పిస్తుందని ఆశిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో లోతుగా అధ్యయనం చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర పురోభివృద్ధికి, రాష్ట్ర వికాసానికి ప్రధాన మూలం విద్య తప్ప మరొకటి కాదు అనే ప్రగాఢ నిర్ణయానికి వచ్చిన మీదట.. పరిపాలనా పగ్గాలు చేపట్టిన మొదటి రోజు నుంచే రాష్ట్రంలో విద్యా సంస్కరణలపై దృష్టి సారించి, ప్రైవేట్ స్కూళ్ళకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ళను అభివృద్ధి చేసి, పేద విద్యార్ధులను స్కూళ్ళకు పంపడానికి వీలుగా అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించి విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద లాంటి పథకాల ద్వారా ఆదుకుంటున్నాం. మన విద్యార్ధులు పోటీ ప్రపంచంలో నెగ్గుకు వచ్చేలా విద్యా రంగాన్ని తీర్చి దిద్దుతున్న మన ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు” అంటూ బొత్స తీర్మానాన్ని బలపరిచారు.

Also Read : విద్యతోనే పేదరికం జయించాలి: సిఎం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్