Akdi-Pakdi: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ మూవీ ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అవుతుండగా.. విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా పై విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.చార్మి పూరితో కలిసి బాలీవుడ్ మేకర్స్ కరణ్ జోహార్ హీరూ జోహార్ అపూర్వ మోహతా ధర్మా ప్రొడక్షన్స్ పై పూరి కనెక్ట్స్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని ఆగస్టు 25న అత్యంత భారీ స్థాయిలో తెలుగు, హిందీ తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రమ్యకృష్ణ రోనిత్ రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ మూవీ నుంచి పెప్పి నంబర్ గా ఫస్ట్ సింగిల్ అక్డి పక్డి.. అంటూ సాగే లిరికల్ సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. భాస్కర భట్ల సాహిత్యం అందించిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి రమ్య బెహెరా అలపించారు. ఈ పాటలో విజయ్ దేవరకొండ మాసీవ్ స్టెప్పులతో విజిల్స్ తో అదరగొట్టేశాడు. ఫస్ట్ టైమ్ విజయ్ దేవరకొండ ఈ రేంజ్ మాస్ బీట్ కి అదరిపోయే స్టెప్పులేశాడు. ఇంకా చెప్పాలంటే.. మాసీవ్ స్టెప్పులతో దుమ్ములేపాడు. మరి.. సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.