Saturday, November 23, 2024
HomeTrending Newsవివాదాస్పదమైన ఝార్ఖండ్ పాఠశాలల సెలవు

వివాదాస్పదమైన ఝార్ఖండ్ పాఠశాలల సెలవు

ఝార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు సెలవుల అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలోని జంతార, దుమ్క జిల్లాల్లో ఆదివారం కాకుండా శుక్రవారం సెలవు ఇవ్వటం వివాదానికి దారితీసింది. చాలా పాఠశాలలో ఉదయం ప్రార్థనలో వందేమాతరం కాకుండా నమాజ్ చేయించటం వివాదాన్ని రాజేసింది. గురువులకు, పెద్దవాళ్ళకు నమస్కారం చేయటం కాకుండా ముస్లిం సంప్రదాయం ప్రకారం చేయిస్తున్నారు. మధ్యాహ్న భోజన చార్ట్ లో కూడా శుక్రవారం సెలవుగా పేర్కొన్నారు. ఈ తతంగమంతా అధికార యంత్రాంగానికి తెలియకుండా జరుగుతోందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. 2015 నుంచి ఆదివారం బదులు శుక్రవారం సెలవుగా పాటిస్తున్నారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత సోరెన్ దుమ్క పట్టణంకు చెందిన వారు కావటం గమనార్హం.

ముస్లీంలు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఉన్న ఉర్దూ స్కూల్స్ లో విద్యార్థుల వారాంతపు సెలవుల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత రెండు సంవత్సరాలుగా ఆదివారం కాకుండా శుక్రవారం ఉర్దూ స్కూల్స్ కు సెలవు ఇస్తున్నారని, ఆదివారం స్కూల్ లో విద్యార్థులు చదువుకుంటున్నారని అధికారులకు సమాచారం అందింది. ఆదివారం కాకుండా విద్యాసంస్థలకు శుక్రవారం సెలవులు ఇస్తున్నారని విద్యాశాఖ అధికారులకు సమాచారం అందింది. మ్యాటర్ తెలుసుకున్న ప్రభుత్వం ఉర్దూ స్కూల్స్ కు శుక్రవారం సెలవు రద్దు చేసి ఆదివారం సెలవు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఉర్దూ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. జార్ఖండ్ లో జంతార, దుమ్క జిల్లాల్లో అదిక శాతం ముస్లీం కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ జిల్లాలో మాత్రమే 43 ఉర్దూ స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఆదీనంలో ఉన్న 43 ఉర్దూ స్కూల్స్ లో వేలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం ఆ స్కూల్ లో పని చేస్తున్న టీచర్లు, ఉద్యోగులకు జీతాలు ఇస్తోంది.

అన్ని స్కూల్స్ కు శుక్రవారం సెలవు రద్దు…. కమిటీలు రద్దు ముస్లీంలు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఉన్న 43 ఉర్దూ స్కూల్స్ లో విద్యార్థుల వారం సెలవుల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అందరూ కచ్చితంగా స్కూల్ కు రావాలని, ఆదివారం సెలవు తీసుకోవాలని జార్ఖండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఇంతకాలం కొనసాగుతున్న స్కూల్ మేనేజ్ మెంట్, పరిపాలన విభాగం కమిటీలను ప్రభుత్వం రద్దు చేసి విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్