Saturday, November 23, 2024
Homeసినిమా'ది వారియర్': విలన్ కోసం తన ప్రొఫెషన్ మార్చుకున్న హీరో కథ!

‘ది వారియర్’: విలన్ కోసం తన ప్రొఫెషన్ మార్చుకున్న హీరో కథ!

Movie Review: రామ్ – కృతి శెట్టి జంటగా లింగుసామి రూపొందించిన ‘ది వారియర్’ ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి నటించాడు. కథలోకి వెళితే .. సత్య (రామ్) డాక్టర్ వృత్తిని  ఎంచుకుని కర్నూల్ లోని ఒక హాస్పిటల్లో బుద్ధిగా తనపని తాను చేసుకుపోతుంటాడు. ఆ ఊళ్లోనే రేడియో జాకీగా పనిచేస్తున్న ‘విజిల్’ మహాలక్ష్మి( కృతి శెట్టి) ప్రేమలో పడతాడు. అందమైన ఆ అమ్మాయితో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసే సత్య, ఒకానొక సందర్భంలో గురు (ఆది పినిశెట్టి) అవినీతిని మీడియా ముందుకు లాక్కొచ్చేస్తాడు.

విలన్ డెన్ లో హీరో కాలు పెడితే అతను ఊర్కుంటాడా .. కొండారెడ్డి బురుజుకి వ్రేలాడదీస్తాడు. సమయానికి తనవాళ్లు రావడంతో అక్కడి నుంచి బ్రతికి బయటపడిన సత్య,  విలన్ అంతు చూడటం కోసం తన ప్రొఫెషన్ మార్చుకుంటాడు. రెండేళ్ల పాటు కఠోర సాధనచేసి ఐపీఎస్ ను సాధిస్తాడు. తనని డాక్టర్ గా తరిమేసిన విలన్ కి ఎదురుగా వచ్చి పోలీస్ ఆఫీసర్ గా నిలబడతాడు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలతో .. సంఘటనలతో కథ అనేక మలుపులు తీసుకుంటుంది. మధ్య మధ్యలో కొన్ని ఎమోషన్స్ యాక్షన్ కి మరింత బలాన్ని చేకూర్చుతుంటాయి.

ఆహో అనిపించే అద్భుతమైన స్క్రీన్ ప్లే అని చెప్పుకోలేంగానీ .. కథలో కొత్తదనం ఉంది. ఇంతకుముందు పోలీస్ కథలు  చాలానే వచ్చినా ఈ తరహా పాయింటును మాత్రం టచ్ చేయలేదు. లింగుసామి తాను చెప్పదలచుకున్నది .. చూపించదలచుకున్నది నీట్ గా చేస్తూ వెళ్లాడు. రామ్ .. కృతి శెట్టి .. ఆది పినిశెట్టి పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగుంది. ఆ  పాత్రలకు వాళ్లు న్యాయం చేశారు కూడా. దేవిశ్రీ పాటలు .. సుజీత్ వాసుదేవ్ కెమెరా పనితనం .. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు ఈ సినిమాకి  హైలైట్ గా నిలిచాయని చెప్పచ్చు. రామ్ అభిమానులను ఎంతమాత్రం నిరాశపరచని సినిమా ఇది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read :  ‘హ్యాపీ బర్త్ డే’లో ఎంతమాత్రం కనిపించని సందడి!  

RELATED ARTICLES

Most Popular

న్యూస్