Monday, June 8, 2026
HomeTrending Newsపెరుగుతున్న కరోనా కేసులు

పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో వరుసగా మూడో రోజూ 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 20,044 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,37,30,071కు చేరాయి. ఇందులో 4,30,63,651 మంది బాధితులు కోలుకోగా, 5,25,660 మంది మృతిచెందారు. మరో 1,40,760 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనాతో 56 మంది మరణించగా, 18,301 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతానికి పెరిగిందని, యాక్టివ్‌ కేసులు 0.32 శాతం, రికవరీ రేటు 98.48 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 199.71 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular