ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో జగదీప్ ధన్‌కర్ వెంట ప్రధానమంత్రి నరేంద్రమోడి, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి తదితరులు ఉన్నారు. జులై 19తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో ఈ రోజు ధన్‌కర్ నామపత్రాలను సమర్పించారు.
అటు కర్నాటకకు చెందిన మాజీ మహిళా గవర్నర్ మార్గరెట్ ఆల్వాను విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో నిలిపారు.