Monday, February 24, 2025
Homeసినిమాఈ నెలలోని వరుస ఫ్లాపులకు 'రామారావు' చెక్ పెట్టేనా?  

ఈ నెలలోని వరుస ఫ్లాపులకు ‘రామారావు’ చెక్ పెట్టేనా?  

రవితేజ కథానాయకుడిగా ‘రామారావు ఆన్ డ్యూటీ‘ సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, శరత్ మండవ దర్శకత్వం వహించాడు. తెలుగులో ఆయనకి ఇదే మొదటి సినిమా అయినా, దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవం చాలానే ఉంది. అలాగే కథ .. స్క్రీన్ ప్లే అందించిన అనుభవం ఉంది. ఇక సినిమాటోగ్రఫీలో ప్రవేశం కూడా ఉండటం మరో ప్రత్యేకత. దివ్యాన్ష .. రజీషా విజయన్ కథనాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానుంది.

ఈ నెలలో ఇంతవరకూ థియేటర్లకు వచ్చిన ఏ సినిమా కూడా వీకెండ్ తరువాత నిలబడలేకపోయింది. ఏ సినిమా కూడా కనీస వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ నెల ఆరంభంలోనే గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ తో థియేటర్స్ కి వచ్చాడు. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా, ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. పెద్ద బ్యానర్లలో మారుతి నుంచి వచ్చిన ఈ సినిమా నిరాశపరిచింది. ఆ తరువాత వచ్చిన ‘ హ్యాపీ బర్త్ డే’ పరిస్థితి మరింత దారుణం. అసలు ఈ కంటెంట్ కి  సినిమా స్థాయి లేదనే విమర్శలు వచ్చాయి.

అలాంటి  పరిస్థితుల్లోనే రామ్ ‘ది వారియర్’ థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. ప్రమోషన్స్ పరంగా పెద్ద హడావిడే జరిగింది. కానీ ఆ స్థాయి సందడి థియేటర్స్ లో కనిపించలేదు. పాటలు మాత్రం కొంతవరకూ హెల్ప్ అయ్యాయి. ఇక విక్రమ్ కుమార్ నుంచి వచ్చిన ‘థ్యాంక్యూ’ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. గతంలో ఈ తరహా కథలు రావడమే కారణమని అనుకున్నారు. ఇక ఈ నెల చివరిలో వస్తున్న ‘రామారావు’పైనే అందరి దృష్టి ఉంది. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ .. ఆయన నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలు ఉన్న సినిమా ఇది. ఈ నెలలో  వరుసగా పలకరించిన ఫ్లాపులకు ఈ సినిమా అయినా చెక్ పెడుతుందేమో చూడాలి.

Also Readజూలై 29న ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్