పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఈ రోజు ఆందోళన చేపట్టారు. రాజ్యసభలో సభ్యుల సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో తెరాస, తృణముల్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో పాటు డిఎంకే పార్టీలు ఆందోళనలో పాల్గొన్నారు. జిఎస్టీ పెంపు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ఇతర ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించాలని గులాబి ఎంపిలు డిమాండ్ చేశారు.
విపక్ష పార్టీలు ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా బిజెపి ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని విపక్ష పార్టీల ఎంపిలు ఈ సందర్భంగా ఆరోపించారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.